calender_icon.png 5 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటు సాగుపై మమకారం.. అటు రాజకీయ వ్యూహం

04-01-2025 12:52:32 AM

  1. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలా బిజీ
  2. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో విస్తృత ప్రయోగాలు
  3. 300 ఎకరాల్లో వెదురు మొక్కల పెంపకానికి శ్రీకారం
  4. స్థానిక సంస్థల ఎన్నికలపైనా దృష్టి
  5. త్వరలో నియోజకవర్గాలవారీగా బీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశాలు

గజ్వేల్, జనవరి 3: తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి, రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తు తం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంత జీవనం గడుపు తున్నారు. మంచి విజన్ ఉన్న రైతుగా సాగులో ప్రయోగాలు చేస్తున్నారు.

వరి, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు పండిస్తున్నారు. కొన్ని వాణిజ్య పంటలూ సాగు చేస్తున్నారు. తాజాగా 300 ఎకరాల్లో వెదురు మొక్కల పెంపకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. మొక్క లు పెద్ద అయిన తర్వాత ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతమవుతుందని, తర్వాత అక్కడ హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు షూట్ చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు సమాచారం.

ఒకవైపు మల్లన్నసాగర్, మరోవైపు కొండపోచమ్మ సాగర్ ఉండగా, తన వ్యవసాయ క్షేత్రంలోని 300 ఎకరాల్లో వెదురు చెట్ల పెం పకం సక్సెస్ అవుతుందని ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాతో పాటు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి.

రాజకీయ సమరానికి వ్యూహాలు..

రైతుగా జీవనాన్ని సాగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ త్వరలో రాజకీయపరమైన వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్‌ఎస్ శ్రేణులను సిద్ధం చేయనున్నారని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చెం దిన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.

ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ ముఖ్యనాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయనా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పను లు, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులు, ప్రజల ఆలోచనా విధానం, కార్యకర్తలు, నాయకుల బలాబలాలతో పాటు ఇంకా ఎన్నో అంశా లపై సుదీర్ఘమైన చర్చలు జరుపనున్నట్లు సమాచారం.

దీంతో పార్టీ సంక్రాంతి పండుగ ఎప్పుడైపోతుందా.. అని ఎదురుచూస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల సంఘం గ్రామాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించగానే, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు.