calender_icon.png 9 January, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రెండూ నాకు కమ్‌బ్యాక్ ఫిల్మ్స్

07-01-2025 12:00:00 AM

సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లో రెండింటికి నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘గేమ్ చేంజర్’ జనవరి 10న, ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు సోమవారం మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన కెరీర్ గురించి, సినిమాల విశేషాల గురించిన ఆసక్తికర విషయాలను తెలియజేశారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... 

  1. బంధువులు, స్నేహితుల మాటలు భయపెట్టాయ్ 
  2. మనవడు డిసప్పాయింట్ అవ్వొద్దన్నాడు! 
  3. పవన్‌కళ్యాణ్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యాను  
  4. నాలుగున్నరేళ్ల కష్టానికి ఫలితం అతి చేరులో ఉంది 
  5. నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు 

సంక్రాంతి వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు సి నిమాల కోసం ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు తమిళ, కర్ణాటక సహా గ్లోబల్ ఆడియెన్స్‌లోనూ అంతే ఆసక్తి ఏర్పడింది. నార్త్‌లోనూ, ఓవర్‌సీస్‌లో తెలుగు సినిమాలకు క్రేజ్, రేంజ్ పెరుగుతున్నాయి. ‘గేమ్ చేంజర్’ నా కెంతో ప్రత్యేకమైన సినిమా.

కోవిడ్ ముందు నుంచి అంటే నాలుగున్నరేళ్ల నుంచి నా జర్నీ ఎలా జరుగుతుందా? అని ఎదు రు చూస్తున్నాను. కోవిడ్ రాక ముందు 2020లో సినిమా స్టార్ట్ చేసి, మే 21నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే అదే ఏడాది మార్చిలో కోవిడ్ వచ్చిం ది. ఆ టైమ్‌లోనే ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ రావటంతో మళ్లీ థియేటర్స్ బంద్ అయ్యాయి.

దాంతో బ్రేక్ కోసం నేను నెల రోజుల పాటు అమెరికా వెళ్లిపోయాను.  ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ తర్వాత మా ఏడేళ్ల మనవడు ఆరాంశ్ ఫోన్ చేసి ‘తాతా.. ను వ్వు డిసప్పాయింట్ అవకు, నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది.. దాంతో కొడతావ్’ అన్నాడు. అది నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది. అప్పుడు చేంజ్ తీసుకున్నాను.

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే విలు వ ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడే క్రమంలో అనుకున్న రిజల్ట్‌తో సినిమాలు రావటం లేదన్నారు. దాంతో నాలో తెలియని భయం ప్రారంభమైంది. స్టోరీ జడ్జ్‌మెంట్ పోయిందా? మళ్లీ కాంబినేషన్లకే వెళ్లాలా? అని ఆలోచించటం మొదలుపెట్టాను. వర్క్‌నంతా స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయించుకున్నాను.

ఆ సమయంలో ‘ఇండియన్ 2’ రిలీజైంది. దాంతో శంకర్ గారి మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ‘గేమ్ చేంజర్’ కథను శంకర్ గారు చెప్పినప్పుడు ఆయనతో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ హీరోకు, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. ‘శంకర్‌గారు ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఉండేది..

నువ్వు కూడా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఒక విలువ ఉండేది’ అని ఓసారి చిరంజీవి అన్నారు. శంకర్ గారు ‘గేమ్ చేంజర్’ కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయిన దానికీ, చిరంజీవి స్టేట్‌మెంట్.. రెండూ సింక్ అయ్యాయి. కమర్షియల్ అంశాలతోపాటు రెస్పెక్ట్‌గా ఫీల్ అయ్యే సినిమా ‘గేమ్ చేంజర్’. ఫైనల్‌గా చూసుకుంటే అన్నీ చక్కగా కుదిరాయి.

నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితం రానుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్‌రెడీ సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనీల్ రావిపూడి. తను కథ చెప్పినప్పటి నుంచి అన్నీ తన మీద వేసుకుని సినిమాను ఎఫ్2లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డారు.

‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్ అని నమ్మకంగా ఉన్నాను. నెక్ట్స్ చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాను.

పవన్‌కళ్యాణ్ నాకు స్ఫూర్తి.. 

పవన్‌కళ్యాణ్ గారు పదేళ్ల జర్నీ చూస్తే మన లో తెలియని ఎనర్జీ వస్తుంది. రాజకీయాల్లో తొలుత వర్కవుట్ కాలేదు.. మళ్లీ వచ్చి సినిమాలు చేశారు. తాజాగా ఆయన పార్టీ 21కి 21 సీట్లు గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఆయనొక గేమ్ చేంజర్‌లా కనిపించాడు. ఫెయిల్ అవుతున్నానని ఆగిపోకూడదు.. ఏ హార్డ్ వర్క్ చేశామో అది మిస్ కాకూడదనుకున్నాను.

అలా కళ్యాణ్ గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జర్నీ చేస్తున్నాను. పవన్ గారు చెప్పే వరకు వకీల్ సాబ్ సినిమా రెమ్యునరేషనే జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడిందని నాకు తెలియదు. అంత పెద్ద స్టేజ్‌పై ఆ విషయం చెప్పటంతో ఎమోషనల్‌గా అనిపించింది. పాదాభివందనం చేయాలనిపిం చింది. 

ఆ కుటుంబాలకు అండగా ఉంటా.. 

రాజమండ్రిలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. మృతులు ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) కుటుంబాలకు నేను అండగా ఉంటాను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. 

టికెట్ ధరల కోసం సీఎంను కలుస్తా.. 

టికెట్ రేట్స్‌ను అసాధారణంగా పెం చేస్తే అది తప్పకుండా ప్రభావం చూపిస్తుం ది. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థా యికి వెళ్లింది. మనకు గౌరవం దక్కుతోం ది. అందుకు తగినట్టే సినిమా బడ్జెట్, పరి ధి పెరిగింది. దానికి అనుగుణంగానే సినిమాలు చేయాల్సిన పరిస్థితి. అలాగే చేస్తున్నారు. ఏపీలో బెనిఫిట్ ఫోస్, టికెట్ రేట్స్ పెంచటంపై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే తెలంగాణ సీఎం గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తాను. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.. నిర్మాతగా నా బాధ్యత అది.