ఆదిలాబాద్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని తేజాపూరు గ్రామం(Tejapur Village)లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు, ఎస్సీ మాలా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గం(Boath Constituency)లో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి తనవంతు ప్రత్యేక సహకారాలు ఎల్లవేళల ఉంటాయని అన్నారు. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంది గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పండరీ, పీఏసీఎస్ ఛైర్మెన్ నానక్ సింగ్, వీడీసీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అనిల్ అన్న యువ సైన్యం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు శ్రీనివాస్ రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.