బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినందుకు ఇద్దరికీ కోర్టు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. 2013వ సంవత్సరంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసిన కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధిస్తూ.. జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ జె. ముఖేష్ తీర్పునిచ్చినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ ఎన్. దేవయ్య తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ జి సృజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వన్ టౌన్ సిఐ కే స్వామి కేసు నమోదు చేసి విచారణ జరిపారు.
బెల్లంపల్లి సిఐగా ఎల్ రఘు ఈ కేసును విచారించి నేరస్తులపై చార్జీ షీట్ వేశారు. కోర్టు కానిస్టేబుల్ కే సురేష్ సాక్షులను ప్రవేశపెట్టారని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. అజయ్ కుమార్ తోపాటు ఈ కేసులో 12 మంది ప్రధాన సాక్షులను మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టి విచారించగా నేరం రుజువైందన్నారు. బెల్లంపల్లి రవీంద్ర నగర్ కు చెందిన వెంబడి మల్లేష్, వెంబడి రాజేందర్ లకు రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ జె .ముఖేష్ తీర్పునిచ్చినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో దేవయ్య తెలిపారు.