calender_icon.png 7 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు కారణాలతో ఇద్దరి సూసైడ్

03-10-2024 12:05:52 AM

నిజామాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ని జామాబాద్ నగరంలోని నగరంలోని ప్రాంతానికి చెందిన బాలిక (15) తల్లి మందలించిందని మూ డు రోజుల క్రితం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు నిజామా బాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందింది.

మరో ఘటనలో నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పరిధిలోని పద్మానగర్‌కు చెందిన కట్ట లలిత(53) కడుపు నొప్పి సమస్యతో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతోంది. బాధను భరించలేక గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు.