calender_icon.png 12 March, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 దాటితేనే బాస్!

09-03-2025 12:00:00 AM

పని, ఫలితాలు.. అనగానే సాధారణంగా మనందరికీ యువతరమే గుర్తుకొస్తుంది. వయసైన వాళ్లతో పోలిస్తే.. 20-30 ఏళ్ల వాళ్లు ఏదైనా సాధిస్తారని అనుకుంటాం. కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు మాత్రం సీనియర్ పదవుల్లోకి 60 దాటిన వాళ్లే అర్హులని భావిస్తున్నాయట. ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ వెలువరించిన నివేదికల ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో 60-70 ఏళ్ల మధ్య వయసులోనే ఎక్కువ ఉత్పాదకతని అందిస్తాడట.

ఇందుకు కారణం.. అప్పటివరకూ సాధించిన విషయ పరిజ్ఞానం, జీవితానుభవం, సంపద అతన్ని స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయట. అలాగే 70--80 మధ్య వయసుని రెండో ఉత్పాదకత దశగా భావించొచ్చట. ఇక మూడో దశ అంటే 50-60 ఏళ్ల మధ్యలో ఉంటుందట. ఫార్చ్యన్ 500 జాబితాలో ఉన్న సీఈవోల సగటు వయసు 63 ఏళ్లట.

అలాగే నోబెల్ బహుమతి విజేతల సగటు వయసు 62 ఏళ్లు. సో ఎవరి జీవితంలో అయినా 60-80 ఏళ్ల మధ్యకాలం అన్నివిధాలా అత్యుత్తమమైనదట. మీరు కానీ ఆ దశలో ఉంటే, ఈ వయసులో ఏం చేస్తాం అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా చేయడానికి ఇదే సరైన వయసు అంటోందీ అధ్యయనం.