10-03-2025 12:00:00 AM
నిరుడు రవితేజ హీరోగా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగునాట అడుగుపెట్టింది మరాఠా ముద్దు గుమ్మ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా కథాపరంగా ఆశించిన మేర ప్రేక్షకులను ఆక ట్టుకోలేకపోయింది. సాధారణంగా ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోతే అందులో నటించిన కథానాయకిని పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ అలా కాదు.. మ్యూ జిక్ చాట్‌బస్టర్ హిట్ అందుకుంది.
ఆ విజయమే అదృష్ట దేవత తనను వరించే భాగ్యం కల్పించిందినట్టుంది భాగ్యశ్రీకి! అంతకుముందు ఒకట్రెండు హిందీ సినిమాల్లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ అయ్యింది. ఏకంగా ఐదు సినిమాల్లో భాగ్యశ్రీనే కథానాయకి. ‘కాంత’లో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా కనిపించ నుంది.
రామ్ 22వ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో హీరోయిన్‌గా బోర్సేనే ఛాన్స్ కొట్టేసింది. సూర్య అట్లూరి చిత్రంలో కథానాయికగా ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. ప్రభాస్ కాంబోలో రానున్న ‘బ్రహ్మరాక్షస్’ సిని మాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ ఆఫర్ ను పొందిందట. మొత్తానికి జోర్ జోర్ సే అంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తోంది భాగ్యశ్రీ బోర్సే.