31-03-2025 06:45:17 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, వారి నివాసంలో బొర్లం గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి, రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశం సర్వ మత సమ్మేళనమని, దేశ ప్రతీ పౌరుడు విధిగా ఇతర మతాలను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొర్లం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.