15-04-2025 04:50:18 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయకాంతి): ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఇటీవల ఏర్పాటు చేసిన నూతన బోరింగ్ ను మాజీ జడ్పీటిసి అరిగెల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం బోరు వేయించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం గ్రామస్థులు అరిగెలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు ప్రసాద్ గౌడ్, సీనియర్ న్యాయవాది దీపక్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.