calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబల్ బెడ్రూమ్ ల నందు బోర్లు మంజూరు..

19-04-2025 10:53:09 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ డబల్ బెడ్రూమ్ ల నందు నీటి సమస్య ఉందని మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి కి డబల్ బెడ్రూమ్ వాసులు గత కొన్ని నెలల క్రితం తెలిపారు. ఈ మేరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కి మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి నూతన బోర్ల కోసం జనవరిలో ఇచ్చిన అభ్యర్థన మేరకు నూతనంగా 10 లక్షల నిధులతో మూడు బోర్లు మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా డబల్ బెడ్రూమ్ వాసులు మాట్లాడుతూ... బీజేపీ మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి కృషి ద్వారానే ఈరోజు ప్రధాన మంచినీటి సమస్య తీరిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే డబల్ బెడ్రూమ్ లో లిఫ్టులు సరిగా పనిచేయడం లేదని, డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం చూపాలని పీసరి బాలమని కృష్ణారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏ. మలేష్ యాదవ్, గోనె మల్లారెడ్డి, ఎంబరి ఆంజనేయులు, డి. ప్రభాకర్ రెడ్డి, ఎన్. రోజా, జి. మోహన్ రెడ్డి, ఎం. అతీష్ బాబు, తలారి బాలు, గణేష్, అలిమేలు, నాగమణి, డబల్ బెడ్రూమ్ వాసులు పాల్గొన్నారు.