calender_icon.png 13 January, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోసిపోయిన రోడ్లు

13-01-2025 02:01:51 AM

  1. సంక్రాంతికి ఊరెళ్లిన పట్నం
  2. ప్రయాణికులతో కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
  3. సోమవారం మరో 300కు పైగా బస్సుల ఏర్పాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): తెలుగు ప్రజలు యేటా సంబురంగా జరుపుకొనే సం క్రాంతి పండుగ నేపథ్యంలో భాగ్యనగరం ఖాళీ అయ్యింది. గ్రేటర్ పరిధిలో కోటికి పైగా జనాభా ఉండగా, దాదా పు 40 శాతం ప్రజలు పండక్కి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో రోజూ వాహనాలతో కళకళలాడిన గ్రేటర్ రహదారులు మూడ్రోజు లుగా నగరం నుంచి పల్లెబాట పట్టడం తో హైదరాబాద్ బోసిపోయినట్టు కన్పించింది.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, లక్డీక పూల్, అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి రహదారుల్లో వాహనాల కదలికలు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందెలను ఎంజాయ్ చేసేందుకు ఆంధ్రా వారితో పాటు తెలంగాణకు చెందిన ప్రజలు సైతం తరలివెళ్లారు. సంక్రాంతి పండుగకు ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి టీజీఆర్టీసీ 6,432 బస్సులను ఏర్పాటు చేయగా, అందులో హైదరాబాద్ నగర ఆర్టీసీ జోన్ నుంచే 3 వేలకు పైగా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

అందులో భాగంగా శుక్రవారం 406, శనివారం 1,400, ఆదివారం 450 బస్సులలో ప్రయాణికులు తరలివెళ్లారు. మూడురోజుల్లోనే 2 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ సిటీ జోన్ నుంచి ఊర్లకు బయలుదేరి వెళ్లగా.. సోమవారం కూడా మరో 300లకు పైగా బస్సులను ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ బస్సులు కాకుండానే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి ప్రాంతాల నుంచి రైళ్లల్లో లక్షలాది ప్రయాణికులు ఆయా ప్రాంతాలకు వెళ్లారు.

ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్‌లలో ప్రయాణికులు తమ ఊర్లకు పయనమయ్యారు. మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, లక్డీకపూల్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలో ఆదివారం కూడా ప్రయాణికులతో రద్దీ నెలకొంది.