- అన్యాక్రాంతమవుతున్న భూములు
- యధేచ్చగా బోరులు వేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు
కోనరావుపేట, జనవరి 7: అటవీ ప్రాంతంలోకి అనుమతులు లేకుండా సైకిల్ను సైతం అనుమతివ్వని అధికారులు, ఏకంగా బోర్వెల్ వాహనాలు సంచరిస్తున్న పట్టించు కోవడం లేదు. అటవీ భూముల్లో అక్రమం గా బోరు బావుల నిర్మాణం చేపడుతున్న అడ్డుకోవాల్సిన అధికారులే, అక్రమార్కులకు అండగా నిలిస్తున్నారు.
అటవీ భూమిని ర క్షించాల్సిన అధికారులు భవిక్షిస్తున్నా వారికే కొమ్ముకాయడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కా ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చించి, చెట్లు నాటుతుంటే, మరో పక్కా అటవీ భూములను అక్రమించుకు నేందుకు అటవీలో చెట్లను నరికివేస్తున్నారు. నరికిన ప్రదేశాల్లో పంటల సాగు సైతం చేస్తు న్నారు.
పంటలు పండించేందుకు సంవృద్ధి గా నీరు కోసం ఏకంగా నిబంధనలకు విరు ద్ధంగా బోరు బావులను ఏర్పాటు చేస్తున్నా రు. ఇదంతా అటవీ అధికారుల కళ్ల ఎదుట కనిపిస్తున్న పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలను కలిగిస్తుంది. రాజన్న సిరిసి ల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల హనుమాన్ తండా అటవీ ప్రాంతంలో య ధేచ్చగా బోరు బావుల నిర్మాణం సాగుతోం ది.
ఇక్కడ అటవీ భూమి అన్యాక్రాంతం అవుతుందనే అటవీశాఖ నీలగిరి ప్లాంటేషన్ చేపట్టింది. ఏపుగా పెరిగిన చెట్లను తొలగిం చేందుకు కొంత మంది అక్రమార్కులు కుట్ర లు పన్నుతున్నారు. నీలగిరి తోటలోకి బోరు వెల్ వాహనం వచ్చేందుకు అడ్డుగా ఉన్న నీలగిరి చెట్లను సైతం నరికివేసి, వాహనానికి లోనికి తీసుకవచ్చారు. దీంతో అటవీ ప్రాంతంలో బోరు నిర్మాణాలు చేపట్టారు.
అయితే అడ్డుకోవాల్సిన అటవీ అధికారు లకు మామ్ముల్లు ముట్టజెప్పి, ఈ తతంగ మంతా చేస్తున్నారని బహిరంగానే అరోపణ లు ఉన్నాయి. దీనికి సమీపంలో అజ్మీర తండాలో ఉన్న నీలగిరి చెట్లను కొం దరు గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. దీంతో ఆ స్థలాన్ని కబ్జా చేసుకునే పని చేస్తు న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వట్టిమల్ల మరిమడ్ల, నిమ్మపల్లి మరిమడ్ల ప్రధాన రహదారి పక్కనే ఉన్న నీలగిరి చెట్లను గుర్తు తెలియని క్రమేపి నరికివేసిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటి కైనా అటవీ ప్రాంతంలో వేస్తున్న బోరు బావుల పై పూర్తి దర్యాప్తు చేసి, బాధ్యులైనా వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అటవీ భూముల్లో వేస్తే చర్యలు
అటవీ భూముల్లో బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అటవీ భూము ల్లో బోర్లు వేసినట్లు మా దృష్టికి రాలే దు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాము. భూక్రమణ చేసి బోర్లు వేస్తే ఉపేక్షించేది లేదు. నీలగిరి చెట్లు నరికి వేస్తే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
ఖాలీలోద్దిన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వేములవాడ