calender_icon.png 27 December, 2024 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మొదటిరోజు ఆట.. ఆసీస్‌ స్కోరు 311/6

26-12-2024 02:05:18 PM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ఐకానిక్‌ మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా (Australia) టాప్-ఆర్డర్ బ్యాటర్ల బలమైన ప్రదర్శన కనబరిచారు. 86 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆ జట్టు 3.62 రన్ రేట్ తో 86 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68), ప్యాట్ కమిన్స్ (8) ఉన్నారు. ఓపెనర్లు సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మూడు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.