calender_icon.png 14 November, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దు అధికారులు సమన్వయం పాటించాలి

12-11-2024 01:38:51 AM

సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ జితేందర్

అధికారులకు డీజీపీ జితేందర్ సూచన

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11, (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దు ల్లో పనిచేస్తున్న అధికారులు సమన్వయంతో ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. సోమవారం సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మావోయిస్టుల కదలికలపై అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నాయ న్నారు.

మావోయిస్టు అగ్రనాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏజెన్సీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ దుశ్చర్యలకు పాల్ప డుతున్నారన్నారు. వారి కదలికలపై నిఘా ఉంచి వారి చర్యలను తిప్పికొట్టాలన్నారు. అనంతరం పోలీస్ ఉన్నతాధి కారులు డీజీపీతో కలిసి భద్రాచలం సీతారామచంద్రస్వా మిని దర్శించుకున్నారు.

సమావేశంలో ఇంటిలిజెన్స్ డీజీపీ శశిధర్‌రెడ్డి, మల్టీజోన్1 ఐజీ పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఆర్‌పీఎప్ అధికారులు, భద్రాద్రి, ములుగు, భూ పాల్‌పల్లి ఎస్పీలు రోహిత్‌రాజు, శభరీష్, కిరణ్ ఖరే, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు.