భారీగా తరలివచ్చిన భక్తులు
నారాయణఖేడ్, మే 16 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్లపోచమ్మ అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగినాయి. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు చేపట్టారు. దుదగొండ గ్రామం మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు తీసుకురాగా ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు కల్పించమన్నారు. జాతర వచ్చె నెల 27వరకు ఏడు వారాల పాటు కొనసాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, పూజారులు పాల్గొన్నారు.