పారిస్ మాస్టర్స్
పారిస్: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పారిస్ మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. టోర్నీలో భాగంగా బుధవారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలి యా) జోడీ 6-4, 7-6 (7/5)తో మార్సెలొ మెలో (బ్రెజిల్)-అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై సునాయాస విజయం సాధించింది.
గంటకు పైగా సాగిన పోరులో బోపన్న జోడీ 4 ఏస్‌లు కొట్టడంతో పాటు ఫస్ట్ సర్వ్‌లో 91శాతం బంతిని అదుపులో ఉంచుకోవడం విశేషం. మ్యాచ్‌లో 11 సర్వీస్ గేమ్స్ నెగ్గిన ఈ జంట ఒక బ్రేక్ పాయింట్ సాధించింది. ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసి ప్రత్యర్థి జంట మూల్యం చెల్లించుకుంది.
ఇక సింగిల్స్ విషయానికి వస్తే నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ సహా ఆరో సీడ్ రుబ్లేవ్, ఏడో సీడ్ కాస్పర్ రూడ్‌లు తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు. ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో అల్కరాజ్ 7-5, 6-1తో జారీపై సునాయాస విజయం సాధించగా.. 8వ సీడ్ దిమిత్రోవ్ 7-6 (11/9), 6-3, 7-5తో ఎట్చెవెర్రీపై కష్టపడి నెగ్గాడు.