calender_icon.png 19 January, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోపన్న డబుల్ బొనాంజా

01-09-2024 12:26:39 AM

  1. డబుల్స్‌లో మూడో రౌండ్‌కు 
  2. మిక్స్‌డ్ డబుల్స్‌లో శుభారంభం

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత స్టార్ రోహన్ బోపన్న డబుల్ బొనాంజ సాధించాడు. పురుషుల డబుల్స్‌లో మూడో రౌం డ్‌లో అడుగుపెట్టిన బోపన్న అటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ శుభారంభం చేశాడు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట రెండో రౌండ్‌లో 6 6 స్పెయిన్ జోడీ రాబర్టో కార్‌బల్లెస్ సునాయస విజయం నమో దు చేసుకుంది. గంట వ్యవధిలోనే ముగిసిన మ్యాచ్‌లో బోపన్న జోడీ 5 ఏస్‌లతో పాటు 30 విన్నర్లు సంధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

మరోవైపు స్పెయిన్ జంట కేవలం 10 విన్నర్లు మాత్రమే కొట్టగలిగింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇండోనేషియా ప్లేయర్ అల్‌దిలా సుతజియాదితో జతకట్టిన బోపన్న తొలి రౌండ్‌లో 7 (9/7), 7 (7/5)తో టిమ్ (జర్మనీ) స్కు ర్స్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధిం చి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇక మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కూడా డబుల్స్‌లో మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు.

పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అల్బానో ఒలివెట్టితో జతకట్టిన బాంబ్రీ..  15వ సీడ్ ఆస్టిన్ (అమెరికా ) (నెదర్లాండ్స్) జంటను మట్టికరిపించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. యూకీ బాంబ్రీ తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో మూడో రౌండ్‌కు చేరుకోవడం ఇది రెండో సారి. ఇంతకముందు 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బాంబ్రీ మూడో రౌండ్ వరకు చేరుకున్నాడు. మరో డబుల్స్ ఆటగాడు శ్రీరామ్ బాలాజీ జంట మాత్రం రెండో రౌండ్‌కు పరిమితమైంది.