calender_icon.png 8 October, 2024 | 7:59 AM

విమానంలో బూతు సినిమా

08-10-2024 02:35:01 AM

ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: విమానంలో ఆస్ట్రేలియా నుంచి జపాన్ బయలుదేరిన ప్రయా ణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లుటై క్యూఎఫ్59 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు బయల్దేరగా, ప్రయాణికుల్లో చాలామంది మహిళలు, చిన్నారు లు ఉన్నారు. వారందరి కోసం ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించారు.

అది అడల్ట్ కంటెంట్ కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.  పలువురు ప్రయాణికులు విమాన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే వద్దని కోరారో అక్కడి స్క్రీన్లలో చిత్రం రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు ఎలాగోలా నిలిపివేసి దానికి బదులు పిల్లలకు ఇష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలంటూ క్వాంటాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.