calender_icon.png 24 January, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూత్ అధ్యక్షులు పార్టీకి మూల స్తంభాలు

24-01-2025 12:07:30 AM

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 

చేవెళ్ల జనవరి 23: బిజెపి పార్టీకి బూత్ అధ్యక్షులు మూల స్తంభాలు అని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకో బడిన మండల అధ్యక్షులు, కౌన్సిల్ సభ్యులు, బూత్ అధ్యక్షులకు సన్మాన కార్యక్ర మాన్ని కెజీఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలితాలే బిజెపి పార్టీని గెలిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విజయం బూత్ అధ్యక్షులపైనే ఆధారపడి ఉందన్నారు .

దేశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని  పట్టుకుని తిరుగడం కాదు దాన్ని పాటించాలని సూచించారు. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ రెండు మూడు సీట్ల కోసం పోటీ చేస్తుందన్నారు. బీజేపీ అంబేద్కర్ కు వ్యతిరేకమని ప్రతిపక్షాలు అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మోడీ అంబేద్కర్ నివసించిన ప్రాంతాలను అభివృద్ధి చేశారని తెలిపారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు . రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, మండలాల అధ్యక్షులు  అనంతరెడ్డి, మణయ్య, శ్రీకాంత్, చంద్రకాంత్, లీలావతి, దయాకర్ రెడ్డి, నాయకులు కొండా రాందేవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బీర్ల నర్సింహ, వెంకట్ రెడ్డి, పాండు రంగారెడ్డి,  డా.వైభవ్ రెడ్డి, గణేష్, సామ మాణిక్య రెడ్డి, శర్వలింగం, మిట్ట వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.