24-02-2025 12:00:00 AM
అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బూమరాంగ్’. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి వూట్ల నిర్మిస్తున్నారు. ఆదివారం మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆండ్రూ మంచి టెక్నీషియన్. తను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సినిమాకే కర్మ థీమ్ తీసుకున్నాడు. చాలా ఛాలెజింగ్ కాన్సెప్ట్ ఇది. ఈ రోజుల్లో ఇలాంటి డిఫరెంట్ థీమ్ ఉన్న థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి’ అన్నారు. డైరెక్టర్ విజయ్‌కుమార్ కొండా మాట్లాడుతూ.. ‘ఆండ్రూ నా సినిమాలన్నీటికీ డీవోపీ.
ఆయన ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్లాక్ బస్టర్ కొడతారని నమ్ముతున్నా. హారర్ థ్రిల్లర్‌కు మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్‌ను సెలెక్ట్ చేసుకోవడంతోనే సక్సెస్ సాధించినట్లయింది. శివ డిఫరెంట్ కథలు చేస్తున్నారు’ చెప్పారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఒక డార్క్ సైడ్ ఉంది.
అండర్ కరెంట్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కచ్చితంగా ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది’ అన్నారు. చిత్ర దర్శకుడు ఆండ్రూ బాబు మాట్లాడుతూ.. ‘డైరెక్షన్ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. డీవోపీ కాకముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వర్క్ చేశా. కరోనా సమయంలో చాలా కథలు రాశా.
అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసిన కథే ఇది. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రవీణ్‌రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.