- అశ్విన్ రికార్డు సమం
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో 21 వికెట్లతో లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్న బుమ్రా ప్రస్తుతం బౌలర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రా తొలిస్థానాన్ని మరింత పదిలపరుచుకున్న బుమ్రా తాజాగా 904 పాయింట్లు సాధించి అత్యధిక రేటింగ్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. 2016 డిసెంబర్‌లో అశ్విన్ (904) ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఇక ఆల్‌రౌండర్ జడేజా నాలుగు స్థానాలు దిగజారి 10వ ర్యాంకుకు పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్ (895), బ్రూక్ (876) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ట్రావిస్ హెడ్ (867) నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జైస్వాల్ ఐదో స్థానంలో, పంత్ 11వ స్థానంలో నిలిచాడు.