11-02-2025 12:00:00 AM
తల్లాడ, ఫిబ్రవరి 10 ః తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపా అనిల్ చౌదరి ఆధ్వర్యంలో రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయకుమార్ విద్యార్థులకు బుక్స్ మరియు గైడ్స్ పంపిణీ చేశారు.
అనంతరం మట్టా దయానంద్ మాట్లాడుతూ... టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు మంచిగా చదువుకొని ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించి నూతనకల్ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చి తమ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు యొక్క ఆశయాలను సాధించాలని ఎడ్యుకేషన్ పరంగా తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కూళ్లలో ఎన్నో సేవలను అందిస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో కాపు సుధాకర్, దీవెల కృష్ణయ్య, పొట్టేటి జనార్ధన్ రెడ్డి, రాము, రాయల రాము, బండి బాల శౌరి, రమేష్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, నూతనకల్ గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.