calender_icon.png 29 April, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలు విజ్ఞాన భాండాగారాలు

26-04-2025 12:28:30 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): గ్రంధాలు విజ్ఞాన భాండాగారాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆద్వర్యంలో రూపొందించిన ‘జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం‘ గ్రంధాన్ని జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి ) లో ఆవిష్కరించారు. అంతకుముందు పహల్గాం ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి సంఘీభావంగా మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రంథాలు విజ్ఞాన సముపార్జనకు  ఉపయోగపడతాయన్నారు. సాహిత్య వేత్తలు, రచయితలు చరిత్రను నేటి తరాలకు అందించడం అభినందనీయమన్నారు.

రచయితల వల్లనే చరిత్ర భావితరాలకు అందుతుందని, జగిత్యాల జిల్లా సమగ్ర చరిత్ర అందరూ చదవాలని, సమాజంలో కవులను, రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చుక్క నవీన్, తోట మల్లికార్జున్, సిపిడిసి కార్యదర్శి డా.శ్రీలత ,ప్రిన్సిపాల్ రామకృష్ణ, మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.