calender_icon.png 3 April, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల బుకింగ్ మార్చి 30 నుంచి ప్రారంభం

28-03-2025 12:00:00 AM

భద్రాచలం, మార్చి 27 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగేశ్రీ రామ నవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ 2025 మార్చి 30 నుండి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వ్బుసైట్ www.bhadradritemple. telangana. gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చు.

ఉత్సవాలు పూర్తున తర్వాత, భక్తులు బుక్ చేసుకున్న తలంబ్రాల ప్యాకెట్లు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపిణీ చేయబడతాయి.తలంబ్రాల ధర: రూ. 60 (ఒక్కొక్కటి)డెలివరీ అందుబాటులో ఉన్న ప్రాంతాలు: తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మాత్రమే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, శ్రీరామ కృపకు పాత్రులు కావాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి గురువారం ఒక ప్రకటనలో కోరారు.