26-02-2025 01:43:27 AM
మూడు వాటర్ ట్యాంకర్లను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): జలమండలి పరిధిలోని వాటర్ ట్యాంకర్లపై అధికారులు గట్టి నిఘా పెట్టారు. పలువురు వాటర్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు వినియోగదారుల క్యాన్ నంబర్లకు వారి ఫోన్ నంబర్లను లింక్ చేసుకుని గృహావసరాల పేరిట వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుని కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తున్నట్లు అధికారుల దృ వచ్చింది.
తాజాగా గృహావసరాల పేరిట బుక్ చేసి కమర్షిల్ అవసరాలకు విక్రయిస్తున్న మూడు వాటర్ ట్యాంకర్లను జలమండలి విజిలెన్స్ అధి మంగళవారం పట్టుకున్నారు. ఓఅండ్‌ఎం డివిజన్ 15లోని మాదాపూర్, డివిజన్ 9 మూసాపేట్, డివిజన్ 6 ఎస్‌ఆర్ నగర్‌లోని ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని నింపుకొని కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఒక్కో వాటర్ ట్యాంకర్‌కు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.