calender_icon.png 11 January, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుక్ రీడింగ్

29-06-2024 12:05:00 AM

  • ఇదొక మంచి అలవాటు!

బుక్స్ చదివే అలవాటు ఉన్నవారిలో కాన్సంట్రేషన్, సూపర్ మెమోరీ, రీజనింగ్, డెసిషన్ మేకింగ్ మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటాయని డాక్టర్ మార్గరేట్ పరిశోధనలో తేలింది. అలాగే రిలేషన్స్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ కి కూడా బుక్ రీడింగ్ హెల్ప్ చేస్తుందని అంటున్నా రు. మెదడుకి దెబ్బ తగిలిన వ్యక్తులని కేవలం బుక్ రీడింగ్‌తో హెల్తీగా మార్చి చూపించా రు డాక్టర్ మార్గరేట్ బ్లేకర్. అందుకే బ్రెయిన్ పవర్ పెరగాలంటే బుక్ రీడింగ్‌కు మించిన ఆప్షన్ లేదని గట్టిగా చెబుతున్నారు. 

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నా కందుకూరి వీరేశలింగం. ఒక పుస్తకానికి ఉండే విలువ అలాంటిది. ఒక పుస్తకం చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం రావడమే కాకుండా మంచి నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని అనేక పరిశోధనలలో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా తమ స్నేహితుడిని (పుస్తకాన్ని) తీసుకువెళ్తారు. బుక్ రీడింగ్ ప్రశాం తంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. 

ఒత్తిడి దూరం..

ప్రస్తుతం చాలామంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. పని భారం, కుటుంబ సమస్యల వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు బుక్ రీడింగ్ సహాయాన్ని  తీసుకోవ చ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ పుస్తకం అనేది మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. ఇదొక బ్యూటీఫుల్ మెడిసిన్. 

నిద్ర బాగాపట్టాలన్నా..

పెద్దలే కాదు.. పిల్లలు కూడా నిద్రలేమితో బాధపడుతుంటారు. బిజీ షెడ్యూల్, ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా నిద్రలేమి సమ స్య అందరిని వేధిస్తున్నది. దాని వల్ల తగినంత నిద్రరాదు. దీనివల్ల కలిగే అలసట పని మీద, చదువు మీద కనిపిస్తుంది. అందుకే పడుకునే ముందు పుస్తకం చదవడం మంచి ది. దీనివల్ల ఆటోమేటిక్‌గా నిద్ర వస్తుంది. చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుం ది. వారు పుస్తకంలోని కొన్ని పేజీలు చదివే వరకు అస్సలు నిద్రపోరు.

రిలాక్స్ అవ్వాలంటే..

ఒక పుస్తకం ప్రశాంతంగా చదివితే నరా లు మొత్తం రిలాక్స్ అయి ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఆఫీసు లేదా ఇంటి పనుల వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదువుతారు. నిత్యం పుస్తకాన్ని చదవడం వల్ల గుండె వేగం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

చదవడం అలవాటు చేసుకోవాలి..

పుస్తకాన్ని చదవడం కనుక అస్వాదించగలిగితే దాన్ని మించిన తృప్తి మరొకటి ఇవ్వ దు. పుస్తకం అమ్మ వలే లాలిస్తుంది. నాన్న వలే ఆదరిస్తుంది. గురువులా బోధిస్తుంది. మార్గదర్శి అవుతుంది. ఒంటరితనంలో స్నేహితుడై ఓదార్పునిస్తుంది. ప్రియురాలై అక్కున చేర్చుకుంటుంది. ‘పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మనోమాలి న్యమనే చీకటిని తొలగిస్తుంది’ అంటారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  

ఫ్యామీలి మొత్తం కూర్చోని కలిసి చదవండి. ఇది ఇంట్లో డిఫరెంట్ వాతావ రణాన్ని క్రియేట్ చేస్తుంది. ఏదైనా కథను బిగ్గరగా చదవడం, చర్చించడం వంటివి పిల్లలు ఇష్టపడే విషయాలు. ఇవి పుస్తకాల ను చదివే ఆసక్తిని, నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా పెద్దలకు, పిల్లలకు మధ్య స్నేహ బంధాన్ని ఏర్పరుస్తుంది.

స్క్రీన్ సమయం తగ్గించుకుని పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపుతున్న మీ పిల్లలకు రివార్డ్‌లను ఆఫర్ చేయండి. ఇది వారికి చదవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వాళ్ళకు నచ్చే పుస్తకాలే కాదు, పెన్నులు, చిన్న చిన్న డైరీలను కూడా తెచ్చి ఇవ్వడం వల్ల పిల్లలకు చదివిన పుస్తకాల గురించి పుస్తకంలో లేదా డైరీలో రాసుకునే అలవాటు దానంతట అదే అలవడుతుంది. మరెందుకు ఆలస్యం ఇలా చేసి పిల్లలకు పుస్తకాల అలవాటు చేయండి. 

పిల్లలు బాగా చదవడంలో, మంచి మార్కులు తెచ్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకంగా ఉంటుంది. పిల్లలకు ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటే ముందు నుంచే వారికి ఒక టైమ్ టేబుల్‌ను ప్రిపేర్ చేసి ఇవ్వండి. వారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి? ఎన్ని సబ్జెక్టులు చదవాలి? అనే విషయాలను అందులో చెప్పాలి. దీనివల్ల వారు ఈజీగా చదవగలుగుతారు.

ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పిల్లలు  స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోమ్‌వర్క్ చేయాలంటే, అలాగే టీచర్‌లు చెప్పిన పాఠాలను చదవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కాబట్టి వారు చదువుకునే టైమ్‌లో టీవీ ఆఫ్ చేయడం, వీలైతే ఇంట్లో వారికి ఒక స్టడీ రూమ్‌ను ఏర్పాటు చేయా లి. దీనివల్ల పిల్లలు బాగా చదివే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

మ్యాథ్స్, సైన్స్ వంటి కొన్ని సబ్జెక్టులు కొంచెం కష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలకు అవి అర్థం కావకపోవచ్చు. కాబట్టి, మీ పిల్లలకు ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయి? ఎందులో ఫెయిల్ అవుతున్నారో గుర్తించండి. తర్వాత వారిని మీరు దగ్గర ఉండి చదివించండి. ఇంకా వారు ఆ సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ట్యూషన్‌లో చేర్పించండి.

పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలతో క్లోజ్‌గా ఉంటూ.. వారిని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించం డి. తర్వాత వారు మీరు అనుకున్నట్లుగా ఎక్కువ మార్కులు సాధిస్తే వారికి గిఫ్ట్‌లు ఇవ్వండి.. అలా అని ఎప్పుడూ పిల్లలను చదవమని కోపంగా చెబితే మొదటికే మోసం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రీడింగ్ లాభాలు..

  1. పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా మెదడును పెంచుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచి, జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదువును అలవర్చాలి. పిల్లలకు ఏది అలవాటు కావాలన్నా కూడా ముందు పెద్దలకు అలవాటు కావాలి. పిల్లలు ఏదైనా పెద్దల నుంచే నేర్చుకుంటారు.  
  2. వయసుకి తగిన పుస్తకాలతో చదవడం ప్రారంభించండి.. పిల్లల వయసు, పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోవాలి. మొదటగా చిన్న పిల్లల కోసం చిత్ర పుస్తకాలతో ప్రారంభించవచ్చు. వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా పుస్తకాలను కొని ఇవ్వడం వల్ల రోజు రోజుకీ వాళ్ళల్లో చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక విధంగా రెట్టింపు అవుతుంది.
  3. చదవడం అనేది రొటీన్‌గా చేసుకోవాలి. నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తకాలను చదవడం కోసం కొద్దిగా సమయాన్ని ఉంచుకోవాలి. ఇలా అలవాటు చేయడం వల్ల ఆసక్తిగా రోజూ అదే సమయానికి పుస్తకం ముందు కూచుంటారు పిల్లలు.
  4. ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోవడం మంచిది. పిల్లలకు ఆసక్తి ని కలిగించే అంశం ఏదై ఉంటుందో అవే పుస్తకాలను చదవడానికి ఎంచుకుంటే త్వరగా చదవడానికి ఆసక్తిని చూపుతారు. పిల్లలు డైనోసార్‌లను ఇష్టపడితే, ఉదాహరణకు, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురిం చి పుస్తకాలను కనుగొనండి.