22-04-2025 09:30:24 AM
ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివి- ఎంఎల్ఏ హరీష్ రావు
రామకృష్ణాపూర్: ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేని మాజీ మంత్రి, ఎంఎల్ఏ హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో 50 ఏళ్ల ప్రయాణం ఒక ప్రస్థానం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవిష్కరించారు. గతంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సిపిఐ (ఎంఎల్)పనిభక్షిలో పని చేసిన రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కంది రాజరత్నాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కంది రాజరత్నాన్ని, కంది రాజనర్సక్క లను శాలువలతో సన్మానించారు.
ఈ పుస్తకం చదివితే గొప్ప పోరాట యోధుడు కనిపించారని చెప్పుకొచ్చారు. గతంలో మేమంతా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ ఉదుమంలో కలిసి చేసినట్లు పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ కార్మిక ఉద్యమం,విప్లద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి మూడు ఉద్యమాల్లో తను పని చేసినట్లు తెలిపారు. అలాగే మూడు ఉద్యమాల్లో జైలు కు సైతం వెళ్లారని అన్నారు.
ఓ సాదారణ కూలి నుండి క్యాబినేట్ మంత్రిగా తన ప్రస్థానం మొదలైనదని చెప్పుకొచ్చారు. ఈ పుస్తకం ద్వారా మరి కొంతమంది నాయకులు ప్రేరణగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ కావు,గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.