calender_icon.png 11 January, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుక్‌ఫెయిర్‌కు విశేష ఆదరణ

02-01-2025 02:57:17 AM

బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): డిసెంబర్ 19 నుంచి 29వ వరకు సాగిన బుక్‌ఫెయిర్‌కు విశేష ఆదరణ లభించిందని, దాదాపు 13 లక్షల మంది హాజరయ్యారని బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు, కవి యాకూబ్, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బుక్‌ఫెయిర్ ముగింపును పురస్కరిం  బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. బుక్ ఫెయిర్‌లో ఢిల్లీ, కోలకత్తా, చెన్నై, పూణె తదితర నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి 210 పబ్లి  వచ్చారన్నారు. 350 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తోపుడుబండి సాధిక్ వేదికపై 60కి పైగా పుస్తకాలను ఆవిష్కరించామన్నారు.బుక్‌ఫెయిర్ ప్రారంభోత్సవా  నికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ముగింపు కార్యక్రమానికి వచ్చిన జస్ట్టిస్ రాధారాణి, బుక్‌ఫెయిర్‌ను విజిట్ చేసిన తెలంగాణ, హరియాణా గవర్నర్లు జిష్ణుదేవ్‌వర్మ, దత్తాత్రేయలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రంథాలయాలకు బుక్‌ఫెయిర్ పుస్తకాల అందజేత

హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ వెల్ ద్వారా సేకరించిన పుస్తకాలను వివిధ ప్రాంతాలకు చెందిన గ్రంథాలయాలకు అందిచినట్లు బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ తెలిపారు. బుక్‌ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ వెల్ (బాక్స్)కు పుస్తకప్రియుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. పుస్తకాలను చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రంథాలయానికి, కొల్లాపూర్ గ్రంథా  విపంచి ఫౌండేషన్‌కు, సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలోని కాళోజీ గ్రంథాలయం, పోలీస్ అకాడమీ లైబ్రరీకి, రామాపురం లైబ్రరీకి అందజేశామన్నారు.