మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇచ్చిన హామీ ప్రకారం రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి హరీశ్‌రావు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రాష్ర్ట వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల ఎకరాల్లో 2.5లక్షల టన్నుల కందులు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కందుల మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు సర్కారు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడం శోచనీయమన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతో బహిరంగ మార్కెట్‌లో రైతు లు కనీస మద్దతు ధర కూడా పొందే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కందులకు క్వింటా ల్‌కు మద్దతు ధర 7,550 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.6,800 మించి చెల్లింపులు జరగడం లేదని రైతులు చెబుతున్నారన్నారు.