16-17 తేదీల్లో బోర్డు సమావేశం
న్యూఢిల్లీ, ఆక్టోబర్ 13: దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో షేర్‌హోల్డర్లకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు అక్టోబర్ 16-17 తేదీల్లో తమ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని విప్రో ఆదివారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2 ఆర్థిక ఫలితాల్ని సైతం అక్టోబర్ 17 గురువారం మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత వెల్లడించనన్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో తెలిపింది. శుక్రవారం విప్రో షేరు స్వల్ప లాభంతో రూ.529 వద్ద ముగిసింది.