calender_icon.png 3 April, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు బోనస్ డబ్బులు జమ చెయ్యాలి

25-03-2025 01:30:52 AM

బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్

కాటారం, మార్చి 24 (విజయక్రాంతి) : కాటారం మండల కేంద్రం లో నిర్వహించిన ప్రజావాణి లో తహసిల్దార్ నాగరాజు కు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్య లతో కూడిన వినతి పత్రంను బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ అందజేశారు.

ఈ సందర్బంగా పాగె రంజిత్  మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం ఇంకా బోనస్ డబ్బులు జమ చేయలేదన్నారు. వెంటనే బోనస్ డబ్బులు జమ చేయాలి, పూర్తి స్థాయి రుణ మాఫీ చెయ్యాలని కోరారు. అలాగే వర్ష కాలం రైతు భరోసా డబ్బులు ముందస్తు గా రైతుల ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులకు సంబందించిన రైతు భరోసా కి సంబందించిన విధి విధానాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, అప్లై చేసుకున్న ప్రతి రైతు కి సబ్సిడీ యంత్రాలు, డ్రిప్, బోరు సౌకర్యం కల్పించాలని, లేని యెడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొమ్మన భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు జిల్లెల్ల శ్రీశైలం, బొంతల రవి ముదిరాజ్, ఆత్మకూరి స్వామి యాదవ్, ఇంజమూరి సదానందం, చీర్ల అశోక్ రెడ్డి, కోటన్న తదితరులు పాల్గొన్నారు.