calender_icon.png 14 March, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో రైతులందరికి బోనస్

14-03-2025 07:25:26 PM

పీఎసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పీఎసీఎస్ పరిధిలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహాయ సహకారాలతో రూ.500 బోనస్ చెల్లించడం జరిగిందని పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రైతులంతా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి కృతజ్ఞతలు తెలుపుతూ హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిల  సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు