16-12-2024 08:54:20 PM
సింగిల్ డిజిట్ కు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎముకలు కోరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతూ సింగిల్ డిజిట్ కు చేరుకుంది. సోమవారం జిల్లాలో సిర్పూర్(యు) మందంలో అత్యల్పంగా 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తిర్యాణి 7.2. కెరమెరి 7.3, వాంకిడి 7.5, కాగజ్ నగర్ 8.4, రెబ్బనలో 9.1, చింతలమానెపెల్లి, సిర్పూర్(టి)లో 9.2, బెజ్జూర్, జైనూర్ 9.4, దహెగాం 9.6, ఆసిఫాబాద్ 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జిల్లాలో 12 మండాలల్లో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రానున్న మూడు రోజులల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.