calender_icon.png 10 February, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటుగాళ్ల చేతిలో బొందెం చెరువు!

10-02-2025 01:37:19 AM

* పట్టాలు చేసి అమ్ముకున్న వైనం

* మున్సిపల్ నరేందర్‌తో పాటు పదిమందిపై కేసు నమోదు

* ప్రజాప్రతినిధుల జోక్యంతో ముందుకు సాగని కేసు 

* 70కి పైగా నకిలీ పట్టాలతో ప్లాట్ల అమ్మకం 

నిజామాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాం తి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అనేక సంవత్సరాలుగా యదేచ్చగా జరుగుతున్న ఫేక్ పట్టాల దందా. గత ఫేక్ పట్టాల కేసు వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఫేక్ పట్టాలతో కేటుగాళ్లు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేసి నకిలీ పట్టాలతో వాటిని విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు.

ఫేక్ పట్టాలు సృష్టించిన ఈ ముఠా వెనుక రాజకీయ పెద్దలు రెవెన్యూ ఉద్యోగులు ఉన్న  గత జిల్లా ప్రాతినిధ్యం వహించిన నాయకుడు సోదరుడి ప్రముఖ పాత్రగా పోలీసులు గుర్తించారు. అధికారుల అండదండలతో అనేక దశాబ్దాలుగా ఈ దందా కొనసాగుతోంది .

ఫేక్ పట్టాల సృష్టికర్తల కంటికి భూములు కనిపిస్తే చాలు క్షణాల్లో పట్టాల సృష్టి వెనువెంటనే భూ కబ్జా ఆ తర్వాత కాంపౌండ్ నిర్మించడం అమ్ముకొని సొమ్ము చేసుకోవడం ఈ దందాలో ఈ ముఠా అరితేరిపోయారు.  ఫేక్ పట్టాలు వాటితో డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ తగాదా భూములు  ఈ భూముల విషయమై జిల్లాలో జరిగిన భూదాంధ వ్యవహారం వెనుకాల బడా నేతల కను సన్నల్లోనే ఇదంతా జరుగుతోందని పోలీసుల దృష్టికి వచ్చింది.  శిఖం భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లు ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. 

చౌకగా స్థలాలు లభిస్తున్నాయి అన్న ఆశతో మధ్యతరగతి బీద బిక్కి జనాలు ఆర్థిక వయ ప్రయాసలు కూర్చి ఉన్నదంతా ఊడ్చి అధిక వడ్డీతో అప్పులు తెచ్చి ప్లాట్లను కొనేశారు తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తాం అన్న ఈ వెంచర్ల తాలూకు బ్రోకర్లు వేసిన వలలో చిక్కుకున్న వీళ్ళు ఎనక ముందు చూడకుండా ప్లాట్లను కొనేసుకున్నారు.

  రఘునాధ చెరువుని ఆనుకుని నగర ప్రజలకి దశాబ్దాలుగా తాగునీటిని అందిస్తున్న రఘునాథ చెరువు పక్కనే ఉన్న బొందెం చెరువు భూమి కబ్జాకు గురైంది. ఈ  బొందెం చెరువు సమీపంలోనే 1.33 ఎకరాల పట్టా భూమి ఉండడంతో ఆ భూమితో పాటు  కేటుగాళ్లు బొందెం చెరువు భూమిని కూడా చెరపట్టారు.  సర్వే నంబర్ 21 49, 21 50 సర్వే నంబర్లలో ఇంటి స్థలాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 మందికి పైగా బీడీ కార్మికులకు అందజేసింది.

ఇది ఇలా ఉండగా బొందెం చెరువు భూమిలో 75 నుండి 110 వరకు ప్లాట్లను విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.  బొందెం చెరువు భూమిలో ఏర్పాటుచేసిన ప్లాట్ల నకిలీ పట్టాల ను తయారు చేస్తున్న కేటుగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి పట్టాల డాక్యుమెంట్లు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.  తనకున్న ఆన్ లైన్ వ్యవస్థతో నకిలీ పట్టాలను యదేచ్చగా తయారు చేస్తూ ఒక డాక్యుమెంట్ కి 70 నుంచి 1 లక్ష 50 వేల రూపాయల వరకు డబ్బును తీసుకుంటున్నట్టు పోలీసుల విచారణలో స్పష్టమైంది. 

గతంలో నిజాంబాద్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెవెన్యూ రికార్డులు దగ్ధమయ్యాయి. ఇదే అధనుగా భావించిన కేటుగాళ్లు సంబంధిత సిబ్బందికి మామూలు ఇచ్చి వివరాలు సేకరించి ఆ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు కొనసాగించారు. ఆన్ లైన్ సెంటర్లో నకిలీ పట్టాలను సృష్టించి మరి అమ్మకాలు సాగించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.

బొందెం చెరువు భూముల్లో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి అన్న ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు మంది మార్బలం సిబ్బందితో వెళ్లి కూల్చివేతలు చేపట్టడంతో ఈ కేటు గాళ్ళ నకిలీ పట్టాల బాగోతం బయటపడింది. ఈ అక్రమ పట్టాల వ్యవహారంలో ప్రథమంగా పోలీసులు ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుని అరెస్ట్ చేసి అతని నుండి పట్టాలు డాక్యుమెంట్లు స్టాంపులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసూకున్నారు.  భూ కబ్జాలు అక్రమ ప్లాట్ల అమ్మకాల వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన  టాస్క్ ఫోర్స్ పోలీసుల శ్రమ శ్రమలాగే మిగిలిపోయింది. అప్పటి సీపీ నాగరాజు ఉన్న సమయంలో ఈ వ్యవహారం నత్తనడకన సాగింది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని పోలీసులు నమోదు చేసిన కేసు లో నుండి కొందరి పేర్లు తప్పించడానికి  బడా నాయకులు రంగంలో దిగి డబ్బులు పెద్ద మొత్తంలో ముట్ట చెప్పారన్నా చర్చ జిల్లాలో కొనసాగింది.

తర్వాత జిల్లా పోలీస్ కమిషనర్ గా సిపి కల్మేశ్వర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దృష్టి సాధించడంతో బొందం చెరువు భూమి అక్రమ దందాలో 10 వ డివిజన్ కార్పొరేటర్ కోమల్ భర్త నరేష్ కమల మహమ్మద్ మక్కల గోపాల్ పై కేసులు నమోదు చేశారు పోలీసుల విచారణ తదుపరి మస్తాన్ జావేద్ అనురాధ ఉబెర్ అంజర్ మంజులత పేర్లను ఈ కేసులో చేర్చారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో అప్పటి నిజామాబాద్ దక్షిణ మండల డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన ఆనంద్ సర్వేయర్ స్వప్న నిజామాబాద్ అర్బన్ రూరల్ సబ్ రిజిస్టర్లు వాసుకి సురేష్ సతీష్ లతో పాటు మున్సిపల్ నరేందర్ అలియాస్ నరేష్ పేర్లు కూడా నకిలీ పట్టాల కేసులో పోలీసులు  చేర్చారు. 

నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన బంటు గణేష్ పేరా 12 వరకు డాక్యుమెంట్లు ఉండడంతో ఆయనతోపాటు అందులో ప్రమేయం ఉన్నా జాతీయ పార్టీ నాయకుడు రత్నాకర్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు.  నగరంలో జరిగిన భూ కుంభకోణంలో లిటిగేషన్ భూముల వ్యవహారంలో ప్రజాప్రతినిధి తమ్ముడు మరో నగర నాయకురాలి భర్త  కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు .

ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇప్పటివరకు ఈ కేసు వ్యవహారం ఎటు తేలలేదు కేసు నమోదు చేసిన పోలీసులు నిమ్మకుండిపోయారు పూర్తి విచారణ జరిపి కాగితాలకే పరిమితమైన ఈ కేసు పై చర్యలు తీసుకొని భూ అక్రమ దారులు అందరినీ కటకటాల వెనక్కి పంపాల్సి ఉంది.