24-03-2025 12:25:30 AM
చేవెళ్ల, మార్చి 23: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ మల్లికార్జున స్వామి వారి నామస్మరణతో మార్మోగింది. ఆదివారం గ్రామంలో బోనా ల ఉత్సవాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
మహిళలు బో నాలు నెత్తిన పెట్టుకొని గ్రామం నుంచి మల్లికార్జున స్వామి ఆలయం వరకు డోలు వాయిద్యాల మధ్య, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అగ్ని గుండాలు తొక్కే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో సాగింది. అం తకుముందు స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.