11-03-2025 10:37:49 PM
లింగంపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని బోనాల్ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లమ్మ తల్లికి ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో భోనంతో నెత్తిపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పిల్ల పాపలు, పంటలు చల్లగా చూడు అని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గౌడ, సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.