calender_icon.png 19 April, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు ఆమోదానికి బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు సమర్పణ

09-04-2025 12:06:04 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : ముషీరాబాద్‌కు చెందిన బీసీ సంక్షేమ సంఘం మహిళా కమిటీ అధ్యక్షురాలు కళావతి ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మకు మంగళవారం బోనాలు సమర్పించారు. బీసీ బిల్లు ఆమోదం పొందడం కోసం బోనాలు సమర్పించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు రాజేందర్, టీఆర్ గోవింద్, మహిళా కమిటీ నాయకులు మహేశ్వరి, శివాని తదితరులు పాల్గొన్నారు.