బూర్గుపల్లి చౌడేశ్వరి దేవికి బోనాలు
25-05-2026 02:00 AM
జడ్చర్ల, మే 24: మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో యాదవుల కులదేవత శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి బోనాల పండుగ నిర్వహించారు, ప్రతి సంవత్సరము కులదేవతను కొలుచుకొని, బోనాల సమర్పించి,తమ జీవాలను, (గొర్రెలు, మేకలు, పశువులు) దేవాలయ ప్రాంగణంలో నిలిపి పొలి జల్లుకొని తెల్లవారు జాగారం చేస్తారు. బోనాల ఊరేగింపులో బీర్లవారు డోలు వాయిస్తూ నృత్యాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలలో బూర్గుపల్లి కృష్ణ యాదవ్, పెద్దగొల్ల మల్లేష్, ఎడ్ల చెన్నయ్య,గోరంట్ల మల్లేష్, కొండల్ యాదవ్,మేడిపూరి పెద్ద నర్సిములు, బైకని మల్లేష్, దశరథం,మేడిపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.






