calender_icon.png 31 October, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి పట్టణంలో బోనాల వేడుకలు

01-07-2024 01:17:41 AM

  • హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి/మంథని, జూన్30 (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని ఆదివారం నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. ఆలయంలో పూజలు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా ఉండాలని కాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.  

కామారెడ్డిలో బోనాల ఊరేగింపు

కామారెడ్డి, జూన్ 30(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షేర్‌గల్లీలో ఆదివారం మున్నూరుకాపు సంఘం మహిళలు పెద్దఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. షేర్‌గల్లీ నుంచి వీక్లీమార్కెట్‌లోని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.