21-02-2025 05:53:54 PM
దస్తూరాబాద్: మండలంలోని గొడిసెర్యాల గ్రామంలో గంగమ్మ కు బోనాల పండుగ ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని గ్రామ ప్రధాన విధుల గుండా డప్పు చప్పుళ్లతో ఆలయానికి చేరుకున్నారు. గంగమ్మకు బోనాలను సమర్పించి, ఒడి బియ్యలను పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఓగ్గు కళాకారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు పలువురుని ఆకట్టుకున్నాయి.