calender_icon.png 29 March, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశవాణిలో... బొమ్మనపల్లి విద్యార్థుల గళం

26-03-2025 06:07:00 PM

టేకులపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో కదంబ కార్యక్రమాన్ని ఇచ్చి తమ ప్రతిభను చాటిచెప్పారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో తమ ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. పాటలు, గేయాలు, సామెతలు, కథలు, ఇంగ్లీష్ రైమ్స్, పొడుపు కథలు, నాటికల ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొమ్మనపల్లి చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులు ఈ అత్యుత్తమ ప్రతిభను ఆకాశవాణిలో ద్వారా చాటిచెప్పారు. ఐదో తరగతి విద్యార్థిని డి. ఊహ అద్భుతంగా యాంకరింగ్ చేసింది. పాఠశాల హెచ్ఎం ఎం.జ్యోతిరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కదంబ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొని తమ గళాన్ని ఆకాశవాణి ద్వారా వినిపించారు. హెచ్ఎం ఎం.జ్యోతిరాణి కూడా భద్రాద్రి జిల్లాలో బాలమేళాపై ఆకాశవాణిలో సమీక్ష ప్రసంగం ఇచ్చారు.