25-02-2025 01:48:21 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని అందుకుతండ గ్రామానికి బొమ్మ సురేందర్ గౌడ్(Bomma Surender Goud)ను బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పొన్నం బిక్షపతి గౌడ్(Ponnam Bikshapathi Goud) మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులు బహుజనులదే అని తెలిపారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టాలని మన ఓటు బీఎస్పీకే అని పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నామని పార్టీ నిర్మాణంలో భాగంగా చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి,జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఓంకార్ ,భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.