హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీగా మహష్ కుమార్ గౌడ్ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న కానీ, ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే శుక్రవారం ఏఐసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖారారు చేసింది.