27-02-2025 03:40:06 PM
చిట్యాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు
చిట్యాల: రైతులకు నీళ్లు ఇవ్వలేక బాంబులతో చెక్ డ్యామ్ కు గండి కొట్టడం దుర్మార్గపు చర్య అని చిట్యాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు(BRS Working President Pitta Suresh Babu) అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట చలివాగు ప్రాంతంలోని చెక్ డ్యాంను పార్టీ సీనులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులకు నీళ్లు ఇవ్వడం చేతకాకనే కాంగ్రెస్ కార్యకర్తలు కూలగొట్టారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్ కు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. దీనికి ఇరిగేషన్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. బాంబులతో కూలగొట్టిన వారిని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్, సీనియర్ నాయకులు పాండ్రాల వీరస్వామి, ఆరేపల్లి సమ్మయ్య, సోషల్ మీడియా ఇంచార్జి కూస ప్రశాంత్ రెడ్డి, ఏలేటి సురేందర్ రెడ్డి, నరిగె అశోక్, మర్రి నరేష్,నవాబుపేట్ గ్రామ అధ్యక్షుడు సాధ రాజు,వలబోజు నరేష్,వేముల అశోక్,సంపంగి శ్రీను పాల్గొన్నారు.