న్యూఢిల్లీ, అక్టోబర్ 19: విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. కొందరు ఆకతాయిలు చేస్తున్న అనాలోచిత పనులతో ప్రయాణికులు, సిబ్బంది, ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. దీంతో అధికారులు విమానాల్లో అణువుణువునా గాలింపు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పధార్థాలు దొరకలేదు.
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగోకు చెందిన 8, ఆకాశకు చెందిన 5 , విస్తారాకు చెందిన 3, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్టార్ ఎయిర్, స్పైస్‌జెట్, అలయన్స్ ఎయిర్‌కు చెందిన విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లేందుకు బయల్దేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టుకు దారిమళ్లించారు. అలాగే ఢిల్లీ పారిస్ విస్తారా విమానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు రావడంతో వాటిని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.