calender_icon.png 4 April, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్‌కర్నూల్, మేడ్చల్ కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు

04-04-2025 12:13:04 AM

  1. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు 
  2. మేడ్చల్ కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఈమెయిల్
  3. తనిఖీల్లో కనిపించని బాంబు ఆనవాళ్లు 

నాగర్‌కర్నూల్/మేడ్చల్, ఏప్రిల్ 3 (విజ యక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లకు గురువారం వచ్చిన బాం బు బెదిరింపులు కలకలం రేపాయి. మేడ్చల్ కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తాం, కలెక్టర్‌ను చంపేస్తామని కలెక్టర్ అధికారిక మెయిల్‌కు సమాచారం వచ్చింది. కలెక్టర్ గౌతమ్.. డీసీపీకి సమాచారం ఇచ్చారు.

బాంబు ఉందని ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీయగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ నక్సలైట్ లక్ష్మణరావు(70) మెయిల్ నుంచి వచ్చినట్టు గుర్తించారు.

మెయిల్‌లో అల్లా హు అక్బర్ అని కూడా ఉంది. ఈ విషయం పై తదుపరి విచారణ చేయాలని కలెక్టర్ గౌ తం పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఇన్‌స్టాకు మెసేజ్

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని బాంబు పెట్టి లేపేస్తామంటూ గురువారం కలెక్టర్ ఇన్‌స్టా ఐడీకి ముప్ప లక్ష్మణ్‌రావు పేరుతో సందేశం వచ్చింది. 2జీ స్కామ్ విషయంలో శంకర్ పట్ల వ్యవహరించిన తీరు, సాదిక్ బాల్వా కస్టడీతో మరణించిన కారణంగా హైడ్రోజన్ ఆధారిత ఐఈడీ కెమికల్ తో పేల్చేస్తానంటూ సందేశం వచ్చింది. సాయంత్రం 3ః30 నిమిషాల్లోగా ఉద్యోగులంతా కార్యాలయాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. దమ్ముంటే ఆపుకోవాలని సవాల్ కూడా చేయడం విషేశం. 

ఇందుకు ఇప్పటికే అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సిస్టంమ్ అబివృద్ధి చేసుకున్నట్లు కూడా తెలిపారు. ఈ మెస్సేజ్‌తో ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనకు గురై బయటికి పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ కనకయ్య డాగ్ స్కాడ్, బాంబుస్కాడ్ బృందాలు తనిఖాలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని గుర్తించారు. దీనిపై విచారణ జరిపి సందేశం పంపిన వారిని పట్టుకుంటామన్నారు.