calender_icon.png 5 April, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు

05-04-2025 12:38:49 AM

జనగామ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): వరంగల్ కోర్టులో బాంబు పెట్టామని ఓ దుండగుడు బెదిరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు నిర్వహిం చారు. వరంగల్ కోర్టులో బాంబు పెట్టామని హనుమకొండ, వరంగల్ జిల్లా జడ్జిలకు శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ మెయిల్ వచ్చింది. జడ్జీలు వెంటనే పోలీసులకు విషయాన్ని తెలిపారు.

కమిష నరేట్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్  సిబ్బంది వరంగల్ జిల్లా కోర్టు సముదాయానికి చేరుకుని దాదాపు రెం డు గంటల పాటు తనిఖీలు చేపట్టా రు. కాంప్లెక్స్‌లో మొత్తం మూడు అంతస్తులను క్షుణ్ణంగా పరిశీలించా రు. చివరకి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. అది ఒక బెదిరింపు మె యిల్ మాత్రమేనని గుర్తించారు. మె యిల్ పంపింది ఎవరు అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.