calender_icon.png 26 October, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు విమానాలకు బాంబు బెదిరింపు

26-10-2024 01:48:28 AM

  1. ఫేక్ మెయిల్స్‌తో కలకలం
  2. ప్రయాణికులను దింపి తనిఖీలు నిర్వహించిన అధికారులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 25: మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ప్రయాణికులతో పాటు అధికారులు హైరానా పడ్డారు. ఈ ఘటన శుక్రవారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

దీంతో అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయా విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఢిల్లీ నుంచి రావాల్సిన విస్తారా విమానాన్ని ముందు జాగ్రత్తగా దారి మళ్లించినట్లు వెల్లడించారు. శంషాబాద్ నుంచి 130 మంది ప్రయాణికులతో చండీగఢ్ వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో హుటాహుటిన ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. అంతా ఫేక్ అని నిర్ధారణ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.