శంషాబాద్,(విజయక్రాంతి): మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతుంది. ఇటీవల కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఒక ఎయిర్ ఇండియా, రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు రావడంతో సిఐ ఎస్ ఎఫ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.