calender_icon.png 4 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

03-04-2025 03:45:23 PM

మేడ్చల్, (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్(Medchal Malkajgiri District Collectorate)కు బాంబు బెదిరింపు కలకలం(Bomb threat) రేపింది. గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. కలెక్టర్ గౌతమ్ ను కూడా చంపేస్తామని పేర్కొన్నారు. దీంతో కలెక్టరేట్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ గౌతమ్ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు లక్ష్మణరావు (70) మెయిల్ చేసినట్టు తెలిసింది.